Schools in Village: ఈ గ్రామంలో బడి 50 ఏళ్ళనాటిది.. ఇప్పుడు ఇది పరిస్థితి..

పిల్లలకు బడిలో ఆటలు చదువు మాత్రమే కాదు ఆ బడిలో తగిన సౌకర్యాలు కూడా ఉండాలి. కానీ, ఈ బడిలో విద్యార్థలకు బడి పరిస్థితే ఇలా ఉంటే రేపు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది..

50 సంవత్సరాలు దాటినా మారని పాఠశాల పరిస్థితి.. బడులే ఇలా ఉంటే మరి విద్యార్థుల భవిష్యత్తు ఎటు దారి తీస్తుంది.
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో ఈ ముకురాల పరిషత్‌ ప్రాతమికోన్నత పాఠశాలను 50 ఏళ్ల క్రితం నిర్వహించారు. ప్రస్తుతం, బడి పరిస్థితి ఇలా ఉండగా విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు.

Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల్లో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి

సరైన సౌకర్యాలు లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. బడి పరిస్థితి కారణంగా విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. బడిలో మరుగుదోడ్లు లేకపోవడం కారణంగా ముఖ్యంగా ఆడపిల్లలకు ఇబ్బందిగా మారింది.

ఈ విషయంపై ఎన్నో ఫిరియాదులు చేసినప్పటికీ ఎటువంటి మార్పులు కలగలేదు. పాఠశాల పునఃనిర్మాణంపై ఎవ్వరూ దృష్టి చూపకపోవడం కూడా దీనికి కారణం..

#Tags