Telugu Medium : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం బోధన లేకపోవడం విచాకరం..
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర సహాధ్యక్షుడు సి.ఎర్రిస్వామి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.హనుమేష్, జి.తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలో ఆర్‌యూపీపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఎర్రిస్వామి, హనుమేష్, తులసిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా మొట్టమొదటగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
Coaching with Stipend : పోటీ పరీక్ష అభ్యర్థులకు శిక్షణతో స్టైఫండ్..
ఇంతటి కీర్తి సంపాదించుకున్న తెలుగు రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమం బోధన లేకపోవడం విచాకరమన్నారు. కేవలం ఆంగ్ల మాధ్యమం అనేది కాకుండా సమాంతరంగా తెలుగు మాధ్యమం కూడా అమలు చేయాలన్నారు. తెలుగు బోధించే కొందరు టీచర్లు డీఈఓ పూల్‌లో ఉంటూ ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Teachers: కొలిక్కిరాని గురుకుల బదిలీలు!
ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపాలన్నారు. 117 జీఓను వెంటనే రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌యూపీపీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవిందు, నాయకులు ధర్మపురి వెంకటేశ్, గోపాల్, నవీన్‌కుమార్, వెంకటరమణారెడ్డి, ధనుంజయ, రవికుమార్ పాల్గొన్నారు.