Gurukul School Admission New Rules : గురుకుల పాఠశాల అడ్మిషన్లలకు కొత్త నిబంధనలు అమలు

Gurukul School Admission New Rules

సాక్షి ఎడ్యుకేష‌న్: గురుకుల పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు ప్రవేశం పొందాలంటే ద‌ర‌ఖాస్తులు త‌ప్పనిస‌రి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, తాజాగా గురుకులాల్లో విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం పొంద‌డానికి చేసుకునే ద‌ర‌ఖాస్తుల్లో నిబంధ‌న‌లు మార్పులు చేశారని తెలిసింది. ఈ విష‌యం తెలుసుకున్న‌ విద్యార్థుల త‌ల్లిదండ్రులు అయోమ‌యంలో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం Credit Card scheme రూ. 3 లక్షల లోన్: Click Here

గతంలో ద‌ర‌ఖాస్తుల స‌మ‌యంలో బోనఫైడ్ సర్టిఫికెట్‌తో పూర్తి అయ్యేదని కుల ఆదాయం ఇప్పట్లో అడిగేవారు కాదు. కాని, ఇప్పుడు ఈ కుల ఆదాయ, సర్టిఫికెట్‌లు తప్పనిసరి చేశారు.

త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌..
కుల, ఆదాయ, సర్టిఫికెట్ నిబంధన తప్పనిసరి కావడంతో పనులను వదులుకొని తహసిల్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల సర్టిఫికెట్ కోసం నోటరీ తదితర ఫార్మాలిటీ పూర్తి చేయడానికి పనులు వదులుకొని తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు.

పరీక్ష రాసి సీటు వచ్చిన తర్వాత చేసే పనులు, ప్రతి ఒక్కరు ఇప్పుడే ఇవ్వాలన్న నిబంధనతో దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతుందని పలువురు అంటున్నారు. దరఖాస్తు సమయంలో నిబంధనలో సడలింపు ఇవ్వాలని అంటున్నారు.
 

#Tags