Amma Odi for Poor Students: పేదలకు బాసటగా అమ్మ ఒడి.. ఏటా ఇంతమందికి లబ్ధీ..!

అమ్మ ఒడి పథకం కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు వారి చదువులను కొనసాగిస్తున్నారు. ఏపీలో అమలు చేసిన ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు వర్థిస్తుందని తెలిపారు..

ఏలూరు: 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో అమ్మ ఒడి పేరిట ప్రకటించిన పథకం దేశ రాజకీయ వ్యవస్థకు దిక్సూచిగా నిలిచింది. అమ్మ ఒడి పథకం కేవలం పేదలను ఆకర్షించడానికి ప్రవేశపెట్టిన పథకం కాదని నిరూపించుకుంటూ తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరాయంగా ప్రతి విద్యా సంవత్సరంలో పేద తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లోకి ఆర్థిక సహాయం మొత్తాన్ని జమ చేస్తూ తాను గత పాలకుల మాదిరిగా మాటల మనిషిని కాదని, చేతల మనిషినని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిరూపించుకున్నారు.

Free Employment Training: నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారమైనప్పటికీ ఇచ్చిన మాటమీద నిలబడి గత నాలుగు సంవత్సరాలుగా ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక పరిణామంగా విద్యారంగ నిపుణులు విశ్లేషించారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పేద కుటుంబమూ ఆర్థిక స్థోమత లేక తమ పిల్లలను చదివించలేని పరిస్థితి ఎదురుకాకూడదని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తూ పేద తల్లులకు ఆలంబనగా నిలిచారు.

Amma Vodi: చదువుకు ఊపిరి.. అమ్మ ఒడి

గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా విడుదల

సాధారణంగా గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల భారాన్ని తగ్గించుకోవడానికి ఏవో కొన్ని నిబంధనలు మార్చి లబ్ధిదారులను తొలగిస్తూ ఉండడం చూశాం. అయితే, ముఖ్యమంత్రి జగన్‌ తన నవరత్నాల పథకాల్లో మానసపుత్రి అనదగ్గ అమ్మ ఒడి పథకాన్ని ఎంతమంది అర్హులుంటే అంతమందికీ అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని గత నాలుగేళ్ళుగా నిరంతరాయంగా అమలు చేస్తూ తల్లుల ఖతాల్లోకి నేరుగా నిధులు జమ చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకే కాక ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

TET Exam: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

గతంలో వినలేదు, చూడలేదు

పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించడమే కాని, ఇలా ప్రభుత్వం డబ్బులు ఎదురివ్వడం గతంలో నేను చదువుకునే రోజుల్లోగానీ, ఆ తరువాత గానీ ఎప్పుడూ వినలేదు, చూడలేదు. మా అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ రావడం, మా పిల్లలను చదివించుకోవడానికి మాకే ఎదురు డబ్బులిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

– సీహెచ్‌ అలేఖ్య, పత్తికోళ్లలంక

Open School Exams: ఓపెన్‌స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నాలుగేళ్లూ డబ్బులు పడ్డాయి

మా పిల్లలను చదివిస్తున్నందుకు గత నాలుగేళ్లుగా జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులూ కల్పించడమే కాక ఆర్థిక సహాయం చేయడం వల్ల అనేక మంది పేదింటి పిల్లలు చదువుకునే అవకాశం కలిగింది. జగనన్నకు రుణపడి ఉంటాం. పది కాలాల పాటు జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాలాంటి పేద కుటుంబాలకు మరింత మంచి జరుగుతుంది.

– రాయవరపు సత్యవాణి, దొండపాడు

ఫీజుల భయమే లేదు

గతంలో స్కూళ్లు ప్రారంభమవుతున్నాయంటే ఎంతో ఒత్తిడిలో ఉండే వాళ్లం. పిల్లలను చదివించడానికి అవసరమయ్యే ఫీజుల డబ్బులు చెల్లించడం తలకు మించిన భారంగా మారేది. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఫీజుల గురించి భయమే పోయింది. అమ్మ ఒడి డబ్బులు ఠంచనుగా, ఖచ్చితంగా మా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఫీజులను వెంటనే చెల్లించేయగలుగుతున్నాం.

– చొక్క భవాని, శనివారపుపేట

TET Exam: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

చదువుల ఖర్చు వెంటాడేది

పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, టై ఇలా మా పిల్లలకు కావాల్సిన అన్ని విద్యావసరాలనూ జగనన్నే తీర్చుతున్నారు. ప్రభుత్వ బడుల్లో అన్నీ ఉచితమే అయినా పిల్లల చదువులకు ఏదో ఒక ఖర్చు వెంటాడేది. వీటికి డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థమయ్యేది కాదు. జగనన్న ఇచ్చిన అమ్మ ఒడి డబ్బులు ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

– సాయన త్రివేణి, శనివారపుపేట

M Pharmacy: మారిన పరీక్ష ప్రశ్న పత్రం

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.1936.407 కోట్లు

అమ్మ ఒడి పథకం నిమిత్తం గత నాలుగేళ్లుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం రూ. 1936.407 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దీనిలో ఏలూరు జిల్లాలో 2019–20 సంవత్సరంలో రూ.268.3785 కోట్లు, 2020–21 సంవత్సరంలో రూ.265.11 కోట్లు, 2021–22 సంవత్సరంలో రూ.276.3585 కోట్లు, 2022–23 సంవత్సరంలో రూ.259.434 కోట్లు జమ అయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 2019–20 సంవత్సరంలో రూ.214.4025 కోట్లు, 2020–21 సంవత్సరంలో రూ.219.231 కోట్లు, 2021–22 సంవత్సరంలో రూ.218.1915 కోట్లు, 2022–23 సంవతసరంలో రూ.215.301 కోట్లు జమయ్యాయి.

Heavy Rains In Dubai: భారీ వర్షాలకు దుబాయ్‌ అతలాకుతలం.. నీట మునిగిన ఎయిర్‌పోర్ట్‌, మెట్రో స్టేషన్లు!

ఏటా సుమారు 3.30 లక్షల మందికి లబ్ది..

అమ్మ ఒడి పథకాన్ని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతి ఏటా సుమారు 3.30 లక్షల మంది తల్లులకు అమలు చేశారు. దీనిలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2019–20 సంవత్సరంలో 1,42,935 మంది తల్లులు, 2020–21 సంవత్సరంలో 1,46,154 మందికి, 2021–22 సంవత్సరంలో 1,45,461 మంది, 2022–23 సంవత్సరంలో 1,43,534 మంది తల్లులు లబ్ధి పొందారు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి 2019–20 సంవత్సరంలో 1,78,919 మంది తల్లులు, 2020–21 సంవత్సరంలో 1,76,740 మంది, 2021–22 సంవత్సరంలో 1,84,239 మంది, 2022–23 సంవత్సరంలో 1,72,956 మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

ITI National Trade Certificate: ఐటీఐ ఎన్టీసీ పొందటానికి అవకాశం

#Tags