M Pharmacy: మారిన పరీక్ష ప్రశ్న పత్రం
ఈక్రమంలో హనుమకొండలోని యూనివర్సిటీరోడ్డులోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో మొదటిరోజు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ప్రశ్న పత్రం ఇచ్చారని పలువురు విద్యార్థులు ఏప్రిల్ 16న పరీక్షల విభాగం అధికారులుకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 15న మధ్యాహ్నం నిర్వహించిన మోడర్న్ ఫార్మా అనాలటికల్ టెక్నిక్స్ సబ్జెక్టు పేపర్–1లో ఐదు స్పెషలైజేషన్ పేపర్‌లున్నాయి. అయితే ఫార్మాస్యూ లికట్ అనాలసిస్ అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పేపర్ రాయాల్సిన 22 మంది విద్యార్థులకు ఆ పేపర్ ప్రశ్నపత్రానికి బదులు ఫార్మాస్యూటిక్స్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాకాలజీ, అండ్ ఫార్మాకాగ్నసీ పేపర్– 1 ప్రశ్న పత్రం ఇచ్చారని అధికారులకు వివరించారు.
చదవండి: TET Exam: ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
అయితే పరీక్ష జరిగిన సమయంలోనే ఆయా విద్యార్థులు సదరు కళాశాల ప్రిన్సిపాల్ (చీఫ్ సూపరింటెండెంట్)ను అడగ్గా.. ఇదే ప్రశ్నపత్రం అని సమాధానం చెప్పారని విద్యార్థులు ఏప్రిల్ 16న కేయూ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ పరీక్షల విభాగం నుంచి పరీక్ష కేంద్రాలకు ఆన్‌లైన్‌లో ప్రశ్న పత్రాలను పంపిస్తారు.
ఏ పేపర్ ఎంతమంది విద్యార్థులు రాస్తారనే సమాచారం ఉంటుంది. అలాంటప్పుడు ఆయా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాక జిరాక్స్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏఏ విద్యార్థులు ఆయా స్పెషలైజేషన్ పేపర్లు రాస్తున్నారనేది కూడా సరిగా చూసుకోకుండానే ప్రశ్నపత్రం ఇచ్చారనేది స్పష్టమవుతుంది.
ప్రిన్సిపాల్‌తో మాట్లాడా..
ఎం ఫార్మసీ మొదటి సెమిస్టర్ మొదటి పేపర్ పరీక్షలో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇచ్చారనే విషయం మా దృష్టి వచ్చింది. విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడా. విద్యార్థులు పరీక్ష సమయం ముగిసే సమయంలో అది తమ ప్రశ్న పత్రం కాదని చెప్పినట్లు ప్రిన్సిపాల్ సమాధానం ఇచ్చారు. కానీ, ముందే చెప్పినట్లు విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రశ్నలపై ఫార్మసీ కాలేజీ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌తో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేస్తాం. ఒక పేపర్‌కు బదులు మరోపేపర్ ఇచ్చిన వారికి నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకుంటాం.
– నర్సింహాచారి, కేయూ పరీక్షల నియంత్రణాధికారి
Tags
- Subject of Modern Pharma Analytical Techniques
- M Pharmacy First Semester Exams
- Exam Paper 1
- Kakatiya University
- Mahabubabad District News
- Telangana News
- Private pharmacy college
- University Road
- Examination department authorities
- QuestionPaperMixup
- Complaints
- ExaminationDepartment
- April15
- sakshieducation updates