Private School Admissions: ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు సీట్లు..!

విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

సాక్షి ఎడ్యుకేషన్‌: 

షెడ్యూలు ఇలా..

● ఈనెల 20వ తేదీ వరకు సీఎస్‌ఈ. ఏపీ.జీవోవీ.ఇన్‌ పోర్టర్‌లో ఐబీ, ఐఈఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ అమలయ్యే ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రిజిస్ట్రేషన్‌

● 23 నుంచి మార్చి 14 వరకు స్టూడెంట్‌ రిజస్ట్రేషన్‌ విండో ఆన్‌ ది పోర్టల్‌

● మార్చి 20 నుంచి 22 వరకు స్టూడెంట్‌ అప్లికేషన్‌ ఎలిజిబిలిటి డిటర్మినేషన్‌ త్రూ జీఎస్‌డబ్ల్యూ డేటా

● ఏప్రిల్‌ 1న లాటరీ ద్వారా మొదటి విడత జాబితా ప్రచురణ

● ఏప్రిల్‌ 2 నుంచి 10 వరకు ఆయా పాఠశాలల్లో స్టూడెంట్‌ అడ్మిషన్ల ధ్రువీకరణ

● ఏప్రిల్‌ 15న లాటరీ ద్వారా రెండో విడత జాబిత ప్రచురణ

● ఏప్రిల్‌ 16 నుంచి 23వ వరకు ఆయా పాఠశాలల్లో స్టూడెంట్‌ అడ్మిషన్ల ధ్రువీకరణ

YS Jagan Mohan Reddy: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి

విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడం కాకుండా వచ్చే ఏడాదికి సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు వరంలా మారనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరించే యజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటారు.

Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత

పక్కాగా అమలు

ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేందుకు 2022–23 విద్యా సంవత్సతరంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 30 మండలాల పరిధిలో ప్రవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 741 మందిని అర్హులుగా గుర్తించి లాటరీ ద్వారా వివిధ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు.

Free training in beautician course: బ్యూటీషియన్‌ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

ఎంపికైన వారు ఆయా మండలాల్లోని ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. ప్రతికూల పరస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు కేటాయించారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో రిజర్వేషన్‌ నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లు కేటాయించారు. ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర విద్యాశాఖ డీఈవోల ద్వారా ఆయా పాఠశాలలకు పంపించింది. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్‌ఫోన్లకు సమాచారం చేర్చి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేశారు.

Job Mela Tomorrow: శ్రీకాకుళంలో రేపు జాబ్‌మేళా

2024–25 విద్యా సంవత్సరానికి....

విద్యాహక్కు చట్టం –2009 ప్రకారం ఏటా ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలని ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు అధిక పాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇచ్చే అంశాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ఏటా ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్థులకు ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పించేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకున్నారు.

Inter Practical Exams: ముగిసిన ప్రాక్టికల్‌ పరీక్షలు

ఆ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. ఐబీ/ ఐసీఏఎస్‌ఈ/ సీబీఎస్‌ఈ/ స్టేట్‌ సిలబస్‌లు అమలవుతున్న పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఒకటో తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి ఈనెల 6వతేదీ నుంచి సీఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాల్సిందిగా కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Free training: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఎక్క‌డంటే?

దరఖాస్తు చేసుకోవాలి

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక వరంగా చెప్పవచ్చు. ప్రేవేటు పాఠశాలల్లో ఒకటోతో తరగతి ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలి.

–శ్రీరాం పురుషోత్తం, డివైఈఓ,మదనపల్లె

#Tags