Sainik School 6th Class Entrance Exam Question Paper With Key 2024-25 : ఆరో తరగతి సైనిక స్కూళ్ల 2024-25 ప్రవేశ పరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ' ఇదే.. ఈ సారి కొత్తగా..?
ఈ పరీక్షను జనవరి 28వ తేదీ (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించారు.
ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొశ్చన్ పేపర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం అందిస్తుంది. ఈ పరీక్ష 'కీ' ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులుతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రిపేర్ చేయించింది. ఈ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రిపేర్ చేసిన 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అధికారికంగా విడుదల చేసే 'కీ' ని ప్రమాణికంగా తీసుకోవలెను. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.
కొత్తగా 19 కొత్త సైనిక పాఠశాలల్లో 2024 నుంచే ఆరో తరగతిలో..
ఈ స్కూళ్లతో పాటు కేంద్ర రక్షణ శాఖ కొత్తగా ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక పాఠశాలల్లో 2024 నుంచే ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. సీట్ల లభ్యత సంఖ్య, వయోపరిమితి ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. 6వ తరగతి (ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225., 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ (విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం (ఎస్పీఎస్సార్ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.
సైనిక స్కూళ్లన్నింటిలో సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. అంతేకాకుండా ఇవన్నీ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు కావడం మరో విశేషం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తుంటారు.
సైనిక స్కూళ్ల 6వ తరగతి ప్రవేశ పరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ' 2024-25 ఇదే..