Gurukulam Inter Results: బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా ఫలితాలు తెలుసుకోండి

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రావిరాల మహేశ్‌కుమార్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 35,629 మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలిపారు.

పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఆధార్ నెంబరు, పుట్టినతేదీ, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి స్కోరు కార్డును పొందొచ్చు. ఫలితాల కోసం https://apbragcet.apcfss.in/inter-rankcard డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి. 
 

#Tags