2860 Railway Jobs: దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

దక్షిణ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 2860.
వర్క్‌షాప్‌లు/యూనిట్‌లు: సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(పొదనూర్, కోయంబత్తూర్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌(పెరంబూర్‌), రైల్వే హాస్పిటల్‌(పొరంబుర్‌), తిరువనంతపురం డివిజన్, పాలక్కడ్‌ డివిజన్,సాలెమ్‌ డివిజన్, లోకో(పెరంబూర్‌), ఎలక్ట్రికల్‌(పెరంబూర్‌), ఇంజనీరింగ్‌(అరక్కోనం), చెన్నై డివిజన్, మెకానికల్‌(డీజిల్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌ (అరక్కోనం, అవది, తంబరం, రాయపురం), సెంట్రల్‌ (పొన్మలై), తిరుచిరాపల్లి డివిజన్, మధురై డివిజన్‌.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎంఎల్‌టీ, టర్నర్, సీఓపీఏ, ప్లంబర్, పీఏఎస్‌ఏఏ, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్‌ మెకానిక్, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్‌ తదితరాలు.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రైనింగ్‌ పీరియడ్‌: ఫిట్టర్, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్‌ ట్రేడులకు 15 నెలల నుంచి రెండేళ్లు, ఇతర ట్రేడులకు ఒక సంవత్సరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.

వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in/

చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags