RailTel Recruitment: రైల్‌టెల్, న్యూఢిల్లీలో టెక్నికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

న్యూఢిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(రైల్‌టెల్‌) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో సహా టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(టెక్నికల్‌)–09, డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్‌)–03.
అర్హత:

అసిస్టెంట్‌ మేనేజర్‌(టెక్నికల్‌): ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్‌ నిర్వహణ తత్సమాన విభాగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్‌): సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్‌/
ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌: 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
డిప్యూటీ మేనేజర్‌: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: అసిస్టెంట్‌ మేనేజర్‌కు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష. మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(100 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌(50 మార్కులు)నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.
పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌.
పనిచేయాల్సిన ప్రదేశాలు: హైదరాబాద్‌/సికింద్రాబాద్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2025.
వెబ్‌సైట్‌: https://www.railtel.in

>> 600 SBI PO Jobs: క్రేజీ కొలువు.. బ్యాంక్‌ పీవో!.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర వివరాలు ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags