CIL Recruitment 2024: కోల్‌ ఇండియా లిమిటెడ్ లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ4) /మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ3), సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈ3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 72
స్పెషాలిటీ: సర్జరీ, జనరల్‌ ఫిజిషియన్‌/మెడిసిన్, జి–ఓ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, పాథాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ/చెస్ట్‌ సెషాలిటీ, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ, ఈఎన్‌టీ.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ4) పోస్టులకు 42 ఏళ్లు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ3) గ్రేడ్‌ 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ4)కు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ3)కు రూ.60,000 నుంచి రూ.1,80,000, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈ3)కు రూ.60,000 నుంచి రూ.1,80,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌)/హెచ్‌వోడీ(ఈఈ), ఎగ్జిక్యూటివ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, రెండో అంతస్తు, కోల్‌ ఎస్టేట్, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్, సివిల్‌ లైన్స్, నాగ్‌పూర్, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

చదవండి: SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 327 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags