Job Mela: మెగా జాబ్‌మేళా.. 5000కు పైగా ఉద్యోగాలు, ఎప్పుడు? ఎక్కడంటే..

కరీంనగర్‌: ఉద్యోగాల కల్పనకు జాబ్‌ మేళాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. వైష్ణవి టెక్నాలజీస్‌, కాసాని ఫౌండేషన్‌, మైత్రి చానల్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళా వాల్‌ పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
Job Mela

నవంబర్‌ 3న టీఎన్జీవోస్‌ ఫంక్షన్‌ హాల్లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వైష్ణవి టెక్నాలజీస్‌ చైర్మన్‌ కొడిత్యాల శ్రీకాంత్‌ పేర్కొన్నారు. సుమారు 5వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దాదాపు 100 కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్‌, మార్కెటింగ్‌, టెక్నికల్‌ మ్యాన్‌ ఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎండీ విజయరఘురామరాజు, శ్రీనివాస్‌రెడ్డి, చందర్‌ పాల్గొన్నారు.

మెగా జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

మొత్తం పోస్టులు: 5వేలకు పైగా
హాజరయ్యే కంపెనీలు: 100

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 30,000

ఏఏ రంగాల్లో ఖాళీలు: ఐటీ, బ్యాంకింగ్‌ మార్కెటింగ్‌ టెక్నికల్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌

ఎప్పుడు: నవంబర్‌ 03
ఎక్కడ: టీఎన్జీవోస్‌ ఫంక్షన్‌ హాలు, కరీంనగర్‌

Mega DSC Notification Details: 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తివివరాలు ఇవే!

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags