NEET UG Exam 2024 Grace Marks : నీట్ యూజీ 2024లో వీరికి మాత్ర‌మే Grace marks లను తీసేస్తాం.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్‌ యూజీ-2024 ఫలితాలపై ప్ర‌స్తుతం వివాదం న‌డుస్తున్న విష‌యం తెల్సిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. NEET UG 2024 Exam లో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు.

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పాటు నీట్‌ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా Grace marks పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది.

☛ NEET UG Exam 2024 Mass Copying Issue : నీట్ 2024..ఒకే ప‌రీక్ష‌ సెంటర్‌లో 6 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌..ఎలా..? ఎన్‌టీఏ ఇచ్చిన క్లారిటీ ఇదే..

ఆ తర్వాతే కౌన్సెలింగ్‌..
ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం జూన్ 13వ తేదీన (గురువారం) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్‌ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తాం. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి జూన్‌ 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం అని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు.. గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చని పేర్కొంది.

 JEE Advanced Results: పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌.. జనరల్‌ కేటగిరి ఎన్ని మార్కులంటే..

67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు..
ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే  ఫిజిక్స్‌ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

 Supreme Court Issues Notice to NTA Over NEET UG 2024 Paper leak Allegations : నీట్ పరీక్ష 2024 రద్దుకు సుప్రీం నో.. అలాగే ఎన్‌టీఏకు..

 UGC: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లొ రెండుసార్లు అడ్మిషన్లు

#Tags