NEET Ranker: నీట్‌ ర్యాంకర్‌ సిరిసహస్రకు అభినందన

కాగజ్‌నగర్‌రూరల్‌: జాతీయ స్థాయిలో మెడికల్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌లో 60,921 ర్యాంకు(బీసీ కేటగిరి) సాధించిన పట్టణంలోని మెయిన్‌ మార్కెట్‌కు చెందిన సిరిసహస్రను బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, డాక్టర్‌ అనిత దంపతులు ప్రత్యేకంగా అభినందించారు.

పట్టణంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో జూన్ 5న‌ శాలువాతో సన్మానించారు. స్టెతస్కోప్‌ బహుమతిగా అందించారు. నీట్‌ ర్యాంకర్‌ సిరిసహస్రతో పాటు ఆమె తల్లిదండ్రులు దాసరి లక్ష్మణ్‌, మమతను జూన్ 5న‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సభ్యులు మధు, కిరణ్‌, నాగరాజు, రమేశ్‌, సతీశ్‌, వెంకటేశ్‌, రాఖీ, శ్రీనివాస్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:

NEET 2024 Results: ఆలిండియా నీట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గా గుగులోత్‌ వెంకట నృపేష్‌

NEET 2024 Results: ‘నీట్‌’లో కోరుట్ల విద్యార్థుల ప్రతిభ

#Tags