National Handloom Day: చేనేత అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్ తెలి పారు.
ఈ మేరకు చేనేత కళాకారులు, డిజైనర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జూన్ 26న ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కళా కారులకు 2023 నాటికి 30 ఏళ్ల వయసు, పదేళ్ల అనుభవం ఉండాలని, చేనేత డిజైనర్లకు 2023 నాటికి 25 ఏళ్ల వయసు, ఐదేళ్ల అనుభవం ఉండాలని స్పష్టం చేశారు.
దరఖా స్తులను జిల్లా చేనేత జౌళి, సహాయ సంచాలకులకు సమర్పించాలని, మరిన్ని వివరాలకు www.tsht.telangana.gov.inలో చూడాలని శైలజా రామయ్యర్ సూచించారు.
చదవండి:
Handloom Course: హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సుకు ఆహ్వానం
Published date : 28 Jun 2024 09:58AM