Skip to main content

NEET Controversy: నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు

NEET Controversy   Medical college admission controversy    NEET UG 2024 Exam Paper Leakage Scandal

ఢిల్లీ, సాక్షి : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో పేపర్‌ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నీట్‌ పేపర్‌ లీకేజీతో అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లీకేజీకి పాల్పడిన నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశాలు జారీ చేసింది. అలా ఇప్పటి వరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Mechanical Engineering Career: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? బెస్ట్‌ కాలేజ్‌ ఎలా ఎంచుకోవాలి?

అదే సమయంలో ఎన్‌టీఏ చీఫ్‌ను తొలగించింది. పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నీట్‌ పేపర్‌ లీకేజీపై తమ ఆందోళనల్ని తెలుపుతూ వస్తున్నారు.

ఈ తరుణంలో ఎన్‌టీఏ ప్రైవేట్‌ సంస్థ అని,ఎన్‌టీఏ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి అందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది.

సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అంటే...
సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేది బ్రిటీష్ ఇండియాలో ఒక చట్టం. ఇది సాధారణంగా సమాజ శ్రేయస్సు కోరేలా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు సంబంధించిన సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
 

Published date : 27 Jun 2024 11:10AM

Photo Stories