NEET Paper Leak Case: నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం.. నిందితుల్ని అరెస్ట్ చేసిన సీబీఐ
Sakshi Education
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది.
సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్ కుమార్ నీట్ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్ పేపర్‌ను 12మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్ కుమార్ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.
NEET Controversy: నీట్ పేపర్ లీకేజీ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది.
Published date : 28 Jun 2024 10:17AM