Nursing Jobs: జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే..

అర్హులైన యువత జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎంప్లాయీమెంట్‌ అధికారి నీల రాఘవేందర్‌ తెలిపారు..

సిద్దిపేటరూరల్‌: జర్మనీలోని టామ్‌కామ్‌, ఫెడరల్‌ ఎంప్లాయీమెంట్‌ ఏజెన్సీల ట్రిపుల్‌ విన్‌ పాట్నర్‌ లో భాగంగా జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి జిల్లాలోని అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎంప్లాయీమెంట్‌ అధికారి నీల రాఘవేందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జర్మనీకి రిక్రూట్‌ అయ్యే నర్సులకు భాషా శిక్షణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌, ఎన్‌రోల్‌మెంట్‌ ప్రోగ్రాం జరుగుతుందని పేర్కొన్నారు.

Contract Posts: ఈనెల 11 నుంచి కాన్‌ట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న పోస్టుల‌కు ప‌రీక్ష‌లు..

21 నుంచి 38 ఏళ్ల వయస్సు వారు అర్హులని, గుర్తింపు పొందిన కళాశాల నుంచి నర్సింగ్‌, ఐసీయూ, జెరియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, సైకియాట్రి, కార్డియాలజీ, నియోనాటల్‌, సర్జికల్‌ వార్డుల్లో కనీసం 1 నుంచి 3 ఏళ్ల అనుభవంతోపాటు జర్మన్‌ భాషా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు బీ–1 భాషా శిక్షణను స్వదేశంలో పూర్తి చేసిన వారికి జర్మనీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Infosys Employees: ఇన్ఫోసిస్‌లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?

జర్మనీలో బీ–2 గుర్తింపు పరీక్షను పూర్తి చేసిన వారికి రిజిస్టర్డ్‌ నర్సుగా ప్రమోట్‌ చేయబడతారని తెలిపారు. అనంతరం కనీస జీతంగా రూ.2,300 నుంచి రూ.2,800 యూరోలు అందించడంతోపాటు ఓవర్‌ టైమ్‌ అలవెన్సులు కూడా అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 99088 40438, 89190 47600, 7032379066 నంబర్‌ గాని, www.tomcom.telangana.gov.in ను సంప్రదించాలని తెలిపారు.

Parents Role In Child Education: చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి

#Tags