TeamLease EdTech: ఈ రంగంలో అధిక నియామకాలు.. ఈ సేవలకు డిమాండ్..
ఈ రంగంలోని కీలక పోస్ట్‌లకు ఢిల్లీ, చైన్నై నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ కేంద్రాలుగా అవతరించాయని, వైద్య పరిశోధన, అనుబంధ క్లినికల్ పరీక్షలు, డేటా నిర్వహణ విధులు ఇందులో కీలకమని పేర్కొంది. ‘‘వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి చికిత్సలు తీసుకోవడం కంటే, అవి రాక ముందే రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంశాల కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది’’అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు.
ఆన్‌లైన్ వైద్య సేవలకు డిమాండ్
చదవండి: Marie Curie: రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళ.. ఆమె ఎవరంటే..
వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్లకు ముంబై, హైదరాబాద్, ఇండోర్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. డయాగ్నోస్టిక్స్ సేవల విస్తరణ, ఇంటర్నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల నుంచే వైద్య సహకారం పొందడం వంటివి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్టు రూజ్ తెలిపారు. ల్యాబ్ టెక్నిక్, డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, రోగుల సంరక్షణ, డేటా అనలైసిస్‌లో నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |