Job Opportunity: యువతకు ఉద్యోగ అవకాశాలు

పార్వతీపురంటౌన్‌: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పరిపాలన వికేంద్రీకరణ పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు కలిసొచ్చింది.

యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడంతో పాటు ప్రజలకు పాలన చేరువైంది. జవాబుదారీ తనం పెరిగింది. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరోవైపు అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో నెరవేర్చుతోంది. 

ముందస్తుగానే జిల్లాలోని నిరుద్యోగుల వివరాలను సేకరించి వారికి స్కిల్‌హబ్‌లలో వివిధ ఉద్యోగ కోర్సుల్లో శిక్షణ అందజేస్తోంది. నైపుణ్యాలు పెంపొందాక వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపుతోంది.

India Needs Million Jobs: భారత్‌లో 11.5 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరం.. ఎప్ప‌టిలోపు అంటే..

యువతలో నైపుణ్యాలను మెరుగుపరచి ఉపాధి బాటలు వేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషిచేస్తోంది. జిల్లాలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట పాలిటెక్నిక్‌ కళాశాల్లో ఏర్పాటుచేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు వివిధ ఉద్యోగ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. 18 నుంచి 28 ఏళ్ల వయస్సు లోపు యువతకు మూడు నెలలపాటు ఇచ్చే శిక్షణలో నైపుణ్యాలు మెరుగుపర్చుతోంది. 

జాబ్‌మేళాలకు సిద్ధం చేస్తోంది. జిల్లాలోని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత మూడేళ్లలో 13 మల్టీ నేషనల్‌ కంపెనీలు నిర్వహించిన జాబ్‌ మేళాల్లో 2,315 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాబ్‌మేళాలో సుమారు 800 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు.

Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

#Tags