Jobs In Health Department: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..
Sakshi Education

కైలాస్‌నగర్: జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ హెల్త్ మిషన్ ద్వారా పలు పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. మెరిట్, రోస్టర్ ప్రతిపాదికన పోస్టింగ్ కల్పించారు.
Degree Results: డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
వైద్యాధికారులు ఐదుగురు, ఫార్మసిస్ట్‌లు ముగ్గురు, స్టాఫ్ నర్స్‌లు 27, ఏఎన్‌ఏంలు 13, రేడియోగ్రాఫర్ 1, సైకియాట్రిస్ట్ 1, ఫిజియో థెరపిస్ట్ 1, వీసీసీఎం 1, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఒకటి చొప్పున 52 పోస్టులను భర్తీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఉట్నూర్ డీసీహెచ్‌ఎస్ ఉపేందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Published date : 22 Jun 2024 10:48AM