ITI Campus Drive: ఈ నెల 22న ప్రభుత్వ ఐటీఐ బాలుర కళాశాలలో క్యాంపస్‌ డ్రైవ్‌..

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కెరీర్‌ ప్రోగ్రాం ద్వారా ఈ నెల 22న ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాల, అనంతపురంలో క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథ్స్‌లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. నాన్‌ ఐటీ రంగంలో 2023–2024లో 70 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

ITI Counselling 2024: ప్ర‌భుత్వ, ప్ర‌వేట్ ఐటీఐలో ప్ర‌వేశానికి ఈనెల 19న కౌన్సెలింగ్‌.. ర్యాంకుల ఆధారంగా ఇలా..

ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా హెచ్‌సీఎల్‌ టెక్‌బీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌ను 2023–2024లో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్‌ డ్రైవ్‌కు రెజ్యూమ్‌ లేదా బయోడేటాతో పాటు ఆధార్‌, సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, (పదో తరగతి, ఇంటర్‌), రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 6363095030, 8555085030 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

UPSC Civils Prelims Exam 2024 Paper-1 (General Studies) Question Paper: యూపీఎస్సీ సివిల్స్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్‌ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

#Tags