RTC Depot: ఐటీఐ పూర్తి చేసిన వారికి 'నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ'

మంచిర్యాల అర్బన్‌: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటీస్‌షిప్‌ కోసం వివిధ పరిశ్రమల్లో చేరుతారు.

ఉపాధితో పాటు నేర్చుకున్న కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో అప్రెంటీస్‌షిప్‌ పేరుతో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వీరికి స్టైఫండ్‌ అందజేస్తారు. ప్రస్తుతం ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్‌తో పాటు ఐటీఐలో సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు డ్యూయల్‌ ట్రెనింగ్‌ సిస్టమ్‌ (డీఎస్‌టీ) అమలు చేస్తున్నారు. 

విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోగాత్మకంగా ఆయా కోర్సుల్లో మూడునెలల పాటు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు అన్‌జాబ్‌ ట్రెనింగ్‌ సిస్టమ్‌తో వివిధ పరిశ్రమలు విద్యార్థులకు ఆరునెలల శిక్షణతో పాటుస్టైఫండ్‌ చెల్లిస్తున్నాయి. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో దాదాపు 80 మంది విద్యార్థులు మోటార్‌మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ కోర్సుల్లో డ్యూయల్‌ ట్రెనింగ్‌ సిస్టమ్‌ ద్వారా శిక్షణ పొందారు. 

School Teachers: ఉపాధ్యాయుల‌కు రెండురోజుల శిక్ష‌ణ‌..!

నైపుణ్యం పెంపొందించేందుకు.. ఆర్టీసీలో చాలా రోజులుగా నియామకాలు లేవు. సిబ్బంది కొరతతో డిపోలో బస్సులు మరమ్మతు చేయటానికి కష్టాలు తప్పటం లేదు. చాలీచాలని సిబ్బందికి విధి నిర్వహణ భారమవుతోంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్‌, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డ్యూయల్‌ ట్రెనింగ్‌ సిస్టమ్‌లో తీసుకుని పనిచేయిస్తున్నారు. 

దీంతో వారిలో నైపుణ్యం పెరుగుతోంది. అప్రెంటీస్‌షిప్‌ పూర్తి చేసిన వారు ఎన్‌సీటీవీ జారీ చేసే ధ్రువపత్రాలు, స్టైఫండ్‌ పొందుతున్నారు. డ్యూయల్‌ ట్రెనింగ్‌తో చదువుతోపాటు కోర్సుల్లో నైపుణ్యం, శిక్షణ పొందటంతో ఉపాధికి రక్షణగా నిలుస్తుంది.

Assistant Professor Posts: ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. అర్హులు వీరే!

#Tags