Skip to main content

Rashtriya Chemicals and Fertilizers Ltd : ఆర్‌సీఎఫ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ కొలువులు.. అర్హులు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌).. పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Management Trainee recruitment  Management Trainee Posts at Rashtriya Chemicals and Fertilizers Limited

దీనిలో భాగంగా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీకి సంబంధించి వివిధ విభాగాల్లో 158 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్, ఎంబీఏ పట్టభద్రులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
»    మొత్తం పోస్టులు: 158
»    విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, సీసీ ల్యాబ్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మార్కెటింగ్, హ్యూమన్‌ రిసోర్సెస్, అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌.
పోస్టులు–అర్హతలు
»    కెమికల్‌: కెమికల్‌ ఇంజనీరింగ్‌/పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ టెక్నాలజీలో నాలుగేళ్ల బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేయాలి.
»    మెకానికల్‌: మెకానికల్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి.
»    ఎలక్ట్రికల్‌: ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి.
»    ఇన్‌స్ట్రుమెంటేషన్‌: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి.
»    సివిల్‌: సివిల్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి.
»    ఫైర్‌: ఫైర్‌/ఫైర్‌ అండ్‌ సేఫ్టీ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి.
»    సీసీల్యాబ్‌: కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేయాలి. లేదా కెమికల్‌ ఇంజనీరింగ్‌/పెట్రో కెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌ పూర్తిచేయాలి.
»    ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌: ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ చేయాలి. లేదా ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ చేసి.. ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ /ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
»    మార్కెటింగ్‌: సైన్స్‌/ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ డిగ్రీ, ఎంబీఏ(మార్కెటింగ్‌) అగ్రికల్చర్‌ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్‌)/అగ్రికల్చర్‌ పాసవ్వాలి. లేదా సైన్స్‌/ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/అగ్రికల్చర్‌/మార్కెటింగ్‌ పూర్తిచేయాలి.
»    హ్యూమన్‌ రిసోర్సెస్‌: ఏదైనా డిగ్రీ, హ్యూమన్‌ రిసోర్స్‌/పర్సనల్‌/సోషల్‌ వర్క్స్‌/వెల్ఫేర్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/లేబర్‌ స్టడీస్‌లో మాస్టర్‌ డిగ్రీ చేయాలి. లా డిగ్రీ చేసి, మరాఠీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం ఉంటుంది.
»    అడ్మినిస్ట్రేషన్‌: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ(హెచ్‌ఆర్‌)/మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌/మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేయాలి.
»    కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌: ఏదైనా డిగ్రీ,మీడి­యా స్టడీస్, పబ్లిక్‌ స్టడీస్,పబ్లిక్‌ రిలేషన్స్‌/మాస్‌ కమ్యూనికేషన్‌/జర్నలిజంలో పీజీ చేయాలి.
»    ఇంజనీరింగ్‌ డిగ్రీని అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
»    రెగ్యులర్‌ అండ్‌ ఫుల్‌టైమ్‌ డ్యూయల్‌/ఇంటిగ్రేటెడ్‌/అలైడ్‌ డిగ్రీ పాసైనవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
»    వయసు: 01.06.2024 నాటికి అన్‌ రిజర్వ్‌డ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 ఏళ్లకు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల వయో సడలింపు ఉంటుంది.

Jobs at PGCIL : పీజీసీఐఎల్‌లో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

పరీక్ష విధానం
కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఈ పరీక్ష రెండు భాగాలుగా 100 ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. అలాగే జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ /అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగిటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.

తుది ఎంపిక
ఆన్‌లైన్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:7 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ టెస్టుకు 80 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి.. కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు 3 టైర్‌ ఏసీ రైలు/బస్‌ ఛార్జీలు చెల్లిస్తారు.

TS High Court: విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది

ప్రిపరేషన్‌ ఇలా
»    విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. గతంలో చదివినవే కదా అనే నిర్లక్ష్య ధోరణి పనికి రాదు. ముఖ్యంశాలను తప్పనిసరిగా రివిజన్‌ చేసుకోవాలి.
»    జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ /అవేర్‌నెస్‌కు బ్యాంక్, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయెచ్చు. పరీక్ష వ్యవధిలోనే సమాధానాలు గుర్తించడానికి ప్రయత్నించాలి.
»    ఆన్‌లైన్‌లో అందుబాటులో మోడల్‌ టెస్టులు రాయాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో సమీక్షించుకుని.. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
»    ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ, లఖ్‌నవూ, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, గువాహటి, కోల్‌కతా, నవీ ముంబయి, థాణే, ఎంఎంఆర్‌ రీజియన్, నాగ్‌పూర్‌.

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01.07.2024
»    వెబ్‌సైట్‌: www.rcfltd.com

Appointment of Vice-Chancellors: వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి..

Published date : 19 Jun 2024 01:12PM

Photo Stories