Reserve Bank of India: ఈ బ్యాంక్‌లకు భారీ జరిమానా విధించిన ఆర్బీఐ!
బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా విధించింది.
జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై..
జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్‌బీఐ అమలు చేస్తోంది.
Indian Stock Market: చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టాక్ మార్కెట్!
ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా..
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్‌బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.