Government teachers: టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: సస్పెన్షన్‌కు గురైన టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, సి ర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు చింతలమానెపల్లి మండలం దిందాలోని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను డీఈవో అకారణంగా సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సందర్శించిన సమయంలో వాగు వద్ద ఉన్న ఉపాధ్యాయులు తమ సమస్యలు వివరించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న కౌటాలలో బీఎస్పీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. మణిపూర్‌లోని ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు శ్రీరాంనగర్‌ కాలనీలోని గణపతి నివాసంలో బీఎస్పీ ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు సోయం చిన్నయ్య, తిరుపతి, ముఖ్తియార్‌ తదితరులు పాల్గొన్నారు.

TSCPSEU: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

#Tags