TSCPSEU: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
Sakshi Education
కాగజ్‌నగర్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన పాత పెన్షన్ సాధన సంకల్ప సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, నాయకులు పాల్గొన్నారు. కాగా, పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుంది. ప్రధాన వీధుల నుంచి పటేల్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
Published date : 24 Jul 2023 02:25PM