Outsourcing Jobs: మెడికల్ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే
జనగామ: జనగామ మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 13 కేటగిరీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు తెలిపారు.
ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ల్యాబ్ అటెండెంట్లు(15), డాటా ఎంట్రీ ఆపరేటర్లు(7), దోబీ/ప్యాకర్స్(4), ప్లంబర్(1), థియేటర్ అసిస్టెంట్(2), గ్యాస్ ఆపరేటర్(2), వార్డ్ బాయ్(4) జనగామ జిల్లాకు..రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్లు(3), సీటీ స్కాన్ టెక్నీషియన్లు(3), ఈసీజీ టెక్నీషియన్లు(2), అనస్థీషియా టెక్నీషియన్లు(4), ఎలక్ట్రీషియన్లు(2), హెవీ వెహికిల్ డ్రైవర్(1) పోస్టులు జనగామ, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు ఉన్నాయని పేర్కొన్నారు.
జిల్లాలకు కేటాయించిన విధంగా నియామకం ఉంటుందని, 2025 మార్చి 31 వరకు పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. అవసరాన్ని బట్టి తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. కలెక్టర్(జిల్లా కమిటీ చైర్మన్), ప్రిన్సిపాల్(కన్వీనర్), ముగ్గురు సభ్యుల పర్యవేక్షణలో రిక్రూట్‌మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.
ఈనెల 18, 19, 20 తేదీల్లో జనగామ చంపక్‌హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రి రెండో అంతస్తు ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలకు దరఖాస్తులు స్వీకరిస్తామ ని చెప్పారు. www.gmcjangaon.org/, www. jangaon.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి సమాచారం డౌన్‌లోడ్ చేసుకుని అర్హత సర్టిఫికెట్ల జిరాక్స్, స్వీయ ధృవీకరణతో రావాలన్నారు. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీలకు రూ.100, ఇతరులకు రూ.200, దివ్యాంగులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈనెల 28 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు పరిశీలించి తాత్కాలి క మెరిట్ జాబితాను ప్రిన్సిపాల్ మెడికల్ కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. 30న అభ్యంతరాల స్వీకరణ, వచ్చేనెల 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. 2వ తేదీన ఉద్యోగులకు ఆర్డర్ కాపీలు జారీ చేస్తామని వివరించారు.