Nurse Jobs: నర్సింగ్‌ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నరకు పైగానే వేతనం.. పూర్తి వివరాలు ఇవే

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్‌ హెచ్‌ఆర్‌ ఆధ్వర్యంలో జపాన్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన అభ్యర్థులకు జపనీస్‌ భాష ఎన్‌–5, ఎన్‌, ఎన్‌ 3 స్థాయిలో నేర్పించనున్నట్లు వివరించారు.

Job Mela: 900 పోస్టులు.. రేపే జాబ్‌మేళా

అనంతరం సంబంధిత అభ్యర్థులకు జపాన్‌లో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు 32 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. ముందస్తుగా ఆరు నెలల పాటు బెంగళూరులోని నావిస్‌ హెచ్‌ఆర్‌ సంస్థలో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ రుసుం 3,50,000 ఉంటుందని, మొదటి విడతలో రూ.50 వేలు చెల్లించాలి.అందులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.25 వేలు చెల్లిస్తుందని మిగిలిన రూ.25 వేలు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

DRDO jobs: DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తదుపరి రూ.3 లక్షలను అభ్యర్థి మూడు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత జపాన్‌లో ఉద్యోగ అవకాశం, కావాల్సిన సదుపాయాలను ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్‌ హెచ్‌ఆర్‌ పర్యవేక్షిస్తుందన్నారు. ఉద్యోగం పొందే అభ్యర్థులకు జీతం నెలకు రూ.1,10,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 93811 09098, 99888 53335లో సంప్రదించాలని కోరారు.

#Tags