Mega Job Mela 2024: మెగా ఫార్మా జాబ్‌మేళా.. నెలకు రూ. 12-18వేల వరకు జీతం

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. సిఎంఎస్‌(cms) లాబరేటరీస్‌ అండ్‌ ఎస్‌ డి.ఐ విశాఖపట్నంలో మెగా ఫార్మా జాబ్‌ మేళా జరగనుంది. ప్రముఖ ఫార్మా కంపెనీలు అరబిందో ఫార్మా లిమిటెడ్‌ హెటెరో డ్రగ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఎం ఎస్‌ ఎన్‌ లేబరేటరీస్‌, న్యూ ల్యాండ్‌ లేబరేటరీస్‌, ఇతర ఫార్మా కంపెనీలో ఉద్యోగం కల్పిస్తూ ఈనెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నారు.

బీఎస్సీ కెమిస్ట్రీ(పాస్‌/ఫెయిల్‌), ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ/బైపీసీ),డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. అయితే 2019-2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. వేతనం నెలకు రూ. 12,000- 18,000 వరకు ఉంటుంది.

Jobs at PGCIL : పీజీసీఐఎల్‌లో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ప్రొడక్షన్‌, ‍క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ అసురన్స్‌,మైంటెనెన్స్‌ డిపార్ట్‌మెంట్స్‌లో 50-60 రోజుల పాటు శిక్షణ కల్పిస్తారు. దీంతో పాటు ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 8688080562 లేదా 8688156216 నెంబర్లను సంప్ర‌దించాల‌ని కోరారు. 
 

#Tags