Job Mela: రేపు విజయవాడలో జాబ్‌మేళా.. అర్హులు వీరే..
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు జనవరి 10వ తేదీ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్‌బాబు జనవరి 8వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో రమేష్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా జరుగుతుందన్నారు.
డిగ్రీ, ఐటీ ఐ, పాలిటెక్నిక్, బీఎస్సీ, ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన 24 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు జాబ్‌మేళాలో పాల్గొనడానికి అర్హులని చెప్పారు.
ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు విద్యార్హత పత్రాల ఒరిజినల్స్‌తో పాటు.. ఒక సెట్ జిరాక్స్‌తో ఉదయం 10 గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాల కోసం 93477 79032 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
Job Mela: 10వ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హులకు జాబ్‌మేళా జీతం నెలకు 18800