Job Mela 2024: ఐటీఐ పూర్తిచేశారా? రేపే జాబ్‌మేళా, జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా..

ఏలూరు (టూటౌన్‌): జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, ఏపీ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్‌ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ కాంపౌండ్‌లోని సెట్‌వెల్‌ కార్యాలయంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.ముధుభూషణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

స్పందన స్ఫూర్తి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఏపీ అంతటా) బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు కలవన్నారు. నెలకు జీతం రూ.12,500తో పాటు రవాణా అలవెన్స్‌, ఇన్సెంటివ్స్‌, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారన్నారు. ఇంటర్‌/డిగ్రీ విద్యార్హత కలిగి, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌ రంగంలో అనుభవం కలిగి ఉండాలన్నారు.

TS LAWCET 2024 Results Out: లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత.. హైదరాబాద్‌ వాసికి ఫస్ట్‌ ర్యాంక్‌

ప్రెషర్స్‌ కూడా అర్హులేనని, వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. మోహన్‌ స్పిన్‌టెక్స్‌, మల్లపల్లి, హనుమాన్‌ జంక్షన్‌లో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గార్డ్స్‌ (పురుషులు) పోస్టులకు 8వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్హతతో 18–35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని, జీతం నెలకు రూ.11 వేల నుంచి రూ.13 వేలు చెల్లిస్తారన్నారు.

ఇదే కంపెనీలో మహిళలు/పురుషులకు సహాయకుల పోస్టులకు జీతం నెలకు రూ.8,500 నుండి రూ.12 వేలు, ఫిట్టర్లు పురుషులకు నెలకు జీతం రూ.11 వేల నుంచి రూ.13 వేలు చెల్లిస్తారని, ఐటీఐ పాసైన వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 88868 82032 నంబర్‌లో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కోరారు.

#Tags