Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

సింగరేణి(కొత్తగూడెం): జిల్లాలోని ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, సాయి అంజనా మోటార్స్‌ సంస్థల్లో ఉద్యోగావకాశలు ఉన్నాయని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అర్హత, జీతభత్యాలు ఇలా..
అపోలో ఫార్మసీలో 100 ఫార్మసిస్ట్‌ పోస్టులు, 100 ట్రెయినీ ఫార్మసిస్ట్‌ పోస్టులు ఉన్నాయని, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్‌లకు వేతనం రూ.16,300 నుంచి రూ.25వేల వరకు, ట్రెయినీ ఫార్మసిస్ట్‌లకు రూ.14,800 నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని వివరించారు.

Teacher posts in Gurukuls: గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్‌

సాయి అంజనా మోటార్స్‌లో మార్కెటింగ్‌ టీమ్‌ లీడర్‌ మూడు, మెకానిక్‌ ఆరు పోస్టులు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 10 ఉన్నాయని, టీమ్‌ లీడర్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, మెకానిక్‌లకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయని వివరించారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులు గమనించాలని సూచించారు.

#Tags