Skip to main content

Teacher posts in Gurukuls: గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్‌

 గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్‌   Andhra Pradesh Social Welfare Ambedkar Gurukuls coordinating officer Angadi Muralikrishna announces steps to fill teacher vacancies through demos
Teacher posts in Gurukuls: గురుకులాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్‌

అనంతపురం : ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్‌) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌/పార్ట్‌టైమ్‌ టీచర్స్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో జరిగే డెమో/వాక్‌ఇన్‌కు ఒరిజినల్‌ విద్యార్హత సర్టిఫికెట్ల (డిగ్రీ, పీజీ, టెట్‌, బీపీఈడీ)తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. బాలికల పాఠశాలలకు మహిళలను, బాలుర పాఠశాలలకు పురుషులతో మాత్రమే భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also Read :  Download TSPSC Group-1 Preliminary Key

Published date : 13 Jun 2024 10:41AM

Photo Stories