Indian Air Force Jobs : అగ్నివీర్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొద‌ట్లోనే 40 వేలు జీతం.. వీరే అర్హులు..

భార‌త వాయుసేన‌లో అగ్నివీర్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ అయింది. నిరుద్యోగుల‌కు, అగ్నివీర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్య‌ర్థుల‌కు ఇది భారీ శుభ‌వార్త‌.

సాక్షి ఎడ్యుకేష‌న్: భార‌త వాయుసేన‌లో అగ్నివీర్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ అయింది. నిరుద్యోగుల‌కు, అగ్నివీర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్య‌ర్థుల‌కు ఇది భారీ శుభ‌వార్త‌. ఈ గొప్ప అవ‌కాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అయితే, నిన్న‌టి నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో అనేక మంది అభ్య‌ర్థులు ఇప్పటికే ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు కూడా. ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా..

Job Mela: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు

వ‌యోప‌రిమితి: 17.5 నుంచి 21 ఏళ్ల వ‌య‌స్కుల‌కు అర్హుల‌ని వెల్ల‌డించారు అధికారులు. 

విద్యార్హ‌త‌లు: అభ్య‌ర్థులు త‌మ ఇంట‌ర్ విద్య‌ను పూర్తి చేసుకున్న వారు అర్హుల‌ని తెలిపారు. 

వేత‌నం: ట్రైనింగ్‌లో జీతం గ‌రిష్ఠంగా రూ.40వేలు ఇస్తారు.

Mega Job Mela 2025 : మెగా జాబ్‌మేళా.. 48 కంపెనీలు.. 12,220 ఉద్యోగాలు...

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఈ నెల 27వ తేదీన ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ముగుస్తుంది.

అగ్నిప‌థ్ స్కీం ద్వారా నాలుగేళ్ల ప్రొబేష‌న్ త‌ర్వాత 25 శాతం మందిని విధుల్లోకి తీసుకుంటుంది. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags