IT Freshers : ఐటీ ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ రిక్రూట్‌మెంట్స్..

సాక్షి ఎడ్యుకేషన్: ఐటీ ఫ్రెషర్లకు శుభవార్త.. నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,50,000 ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంం ముగిసే నాటికి ఐటీలో కొత్త వారి నియామకాల సంఖ్య 85 వేల నుంచి 95 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు.
భారీ రిక్రూట్‌మెంట్స్..
కాగ్నిజెంట్, క్యాప్ జెమిని, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు భారీగా ఎత్తున 1,60,000 నుంచి 1,80,000 మంది వరకు కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉందని రీసెర్చ్ అండ్ డేటా సంస్థ అయిన అన్‌ఎర్త్‌సైట్ అంచనా వేసింది.
Project Engineer Jobs: BTech అర్హతతో NIOTలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు జీతం నెలకు రూ.56,000
అయితే, ఇప్పుడు ఉన్న ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగ కోతలు ఉన్నాయి. భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్లు జరగాల్సిన అవసరం ఉంది. దీంతో, జాబ్ రిక్రూట్‌మెంట్‌లో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహారిస్తోంది.
ఈ రంగాల్లో..
ఇక, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్లకు, కొత్త వారి నియామకాలు కొంత మేర పెరగనున్నాయి. అనేకమందికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఐటీ కంపెనీలు.
Constable jobs: 10వ తరగతి అర్హతతో ITBP కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.69,100
ఇలా, చాలా ఐటీ సంస్థలు శ్రామిక శక్తిని, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ వంటి రంగాల్లో, పోస్టుల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు యోచిస్తున్నారు. అభ్యర్థులు ఈ స్కిల్స్‌తో తాజాగా డిగ్రీ పూర్తి చేసుకుని ఉంటే, ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని టీమ్‌లీజ్ తెలిపింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)