High Demand Courses : నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులకు భారీ డిమాండ్.. ఇవి చేస్తే చాలు..
సాక్షి ఎడ్యుకేషన్: ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కోర్సులు, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ కోర్సులు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. ఈ కోర్సులతో కొలువులు సాధిస్తే భవిష్యత్తులో వీటి ప్రయోజనం ఎంతైనా ఉంటుంది.
Bank Job Notification Released: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల
దీంతో ఎంతో మంది ఉన్నతంగా స్థిరపడిన వారు ఉన్నారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొంది భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు వీలుగా నేషనల్ స్కిల్ అకాడెమీ ఓ సువర్ణావకాశాన్ని పొందుపరిచింది. వివరాల్లోకి వెళితే..
సాఫ్ట్ వేర్ కోర్సులు..
చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు, ఉద్యోగావకాశం కోసం వేచి చూస్తున్న యువతకు, నిరుద్యోగులకు నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా వంటి వివిధ కోర్సులతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లోనూ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
Job Mela For Freshers 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!
ఈ శిక్షణ కోసం అభ్యర్థులను దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
అర్హత వీరికే..
ఈ శిక్షణకు ఇంటర్ పాస్, ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. 21 మంది ఎంపిక
మరిన్ని కోర్సులు..
దరఖాస్తుదారులు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి వివిధ కోర్సులు ఉంటాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అదనపు కోర్సుల్లో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్,వెబ్ డిజైన్ కోర్సులతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు ఉన్నాయి.
శిక్షణా విధానం..
కోర్సులు ఈ-లెర్నింగ్ అంటే, ఆన్‌లైన్‌లో శిక్షణ ఉంటుంది, తర్వాత పరీక్షలను కూడా నిర్వహిస్తారు. పాస్ అయిన వారు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు.
వ్యవధి..
కోర్సు వ్యవధి 2 నెలల నుండి 6 నెలల వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.
ప్రత్యేకత ఇదే..
ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (పీఎహ్), మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.
అధికారిక వెబ్‌సైట్..
అప్లికేషన్ సమాచారం ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.