Free Training: నిరుద్యోగ యువ‌త‌కు మూడు నెల‌ల‌పాటు ఉచిత శిక్ష‌ణ‌!

ఈజీఎంఎం– డీడీయూజీకేవై ఆధ్వర్యంలో నిరుద్యోగ‌ల‌కు నిర్వ‌హిస్తున్న ఉచిత శిక్ష‌ణ‌లో చేరేందుకు అర్హులంతా ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి..

ఆసిఫాబాద్‌: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఈజీఎంఎం– డీడీయూజీకేవై ఆధ్వర్యంలో సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగేంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ అండ్‌ శాని టేషన్‌లో ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

Joint Trade Committee: భారత్‌, ఘనా జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం.. కుదుర్చుకున్న కీలక ఒప్పందాలు ఇవే.

శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, బుక్స్‌, యూనిఫాం, షూ, హెల్మెట్‌ అందజేస్తామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువకులు ఎన్‌ఏసీ శిక్షణా కేంద్రం, బెల్లంపల్లిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 83285 07232, 87904 14049 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Medical College Entrance Exam: అధికారుల నిర్ల‌క్ష్యం.. విద్యార్థులకు గంద‌ర‌గోళం! అస‌లేం జ‌రిగింది?

#Tags