Direct Interview Jobs: రేపు కేర్‌ టేకర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు. వీళ్లు అర్హులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలకు అనుబంధంగా ఉన్న విద్యార్థినుల వసతి గృహంలో కేర్‌ టేకర్‌ పోస్టులకు ఈనెల 27న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీఆర్‌ జ్యోత్స్నకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

NEET UG Revised Results: నీట్‌ యూజీ 2024 తుది ఫలితాల్లో గందరగోళం

డిగ్రీ ఆపైన విద్యార్హతలు కలిగి అవివాహితులైన మహిళా అభ్యర్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థినులు వసతి గృహంలోనే ఉండాలని, వేతనంతోపాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థినులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
 

#Tags