Career In Gaming Industry: ఇండియాలో దూసుకెళ్తున్న గేమింగ్‌ ఇండస్ట్రీ.. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు

గత కొన్నాళ్లుగా గేమింగ్‌ ఇండస్ట్రీ శరవేగంగా దూసుకెళ్తుంది. భారత్‌లోనూ గేమింగ్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. గతేడాది నాటికి 15.4 బిలియన్‌ గేమ్‌ డౌన్‌లోడ్స్‌లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. భవిష్యత్తులో దేశీయ గేమింగ్‌ రంగ సంస్థల ఆదాయం అంతకంతకూ పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 1,400 గేమింగ్‌ కంపెనీలు ఉండగా, 500 గేమింగ్‌ స్టూడియోలున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌ గేమింగ్‌ హబ్‌గా నిలుస్తోంది. ఇప్పటికే సిటీలో అనేక గేమింగ్‌ స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరాయి. ఒకప్పుడు  గేమింగ్‌ అంటే ఏదో కాసేపు కాలక్షేపం అనే దగ్గర్నుంచి ఇప్పుడు వృత్తి, నైపుణ్య రంగంలో జెడ్‌ స్పీడుతో పరుగులు పెడుతుంది. మొభైల్‌ గేమర్స్‌తో గేమింగ్‌ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 2025 నాటికి గేమింగ్‌ రంగం 2,50,000కు పైగా ఉద్యోగాలను సృష్టించగలదని నివేదికలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Aeronautical Training Programmes: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ.. కోర్సు పూర్తవగానే ఉద్యోగం!

మొబైల్‌ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మొభైల్‌ గేమింగ్‌ అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. యూజర్‌లు తమ సొంత కంటెంట్‌ను క్రియేట్‌ చేసుకోవడానికి ఎన్నో పాపులర్‌ గేమ్స్‌ అనుమతిస్తున్నాయి. అనేక భారతీయ ఇతివృత్తాలు, కథనాలు, పాత్రలతో వీడియో గేమ్‌లను డిజైన్ చేస్తున్నారు. 


బోలెడు ఉపాధి అవకాశాలు...

వీడియో గేమ్స్‌ నుంచి అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇ- స్పోర్ట్స్‌ ఇటీవల కాలంలో మల్టీ–బిలియన్‌–డాలర్‌ ఇండస్ట్రీగా ఎదిగింది. ప్రొఫెషనల్‌ ప్లేయర్స్‌కు జీతాలతో పాటు స్పాన్సర్‌షిప్‌ అవకాశాలు కూడా వస్తున్నాయి. గేమింగ్‌ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ‘గేమింగ్‌: టుమారోస్‌ బ్లాక్‌బస్టర్‌. ప్రోగ్రామింగ్‌ (గేమ్‌ డెవలపర్స్, యూనిటీ డెవలపర్స్‌), టెస్టింగ్‌ (గేమ్స్‌ టెస్ట్‌ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్‌ అసూరెన్స్‌), యానిమేషన్, డిజైన్‌(మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనర్స్, వర్చువల్‌ రియాలిటీ డిజైనర్స్‌), ఆర్టిస్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్స్‌), కంటెంట్‌ రైటింగ్, గేమింగ్‌ జర్నలిజం మొదలైన విభాగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 

#Tags