Guest Lecturer Posts: వివిధ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్ల ని యామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఐ ఈఓ గోపాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పీజీ కోర్సుల్లో సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలని, జులై 24న సాయంత్రం 5గంటలవరకు హనుమకొండలోని డీఐఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఖాళీలు ఇలా..
జిల్లాలోని కమలాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కెమిస్ట్రీ, హిందీ, హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో మ్యాథ్స్‌, శాయంపేటలోని జూ నియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌, బాటనీ, ఎకనామిక్స్‌, జువాలజీ, వడ్డేపల్లి పింగిళి కళాశాలలో సంస్కృతం, పరకాల కళాశాలలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ, పీఎస్‌టీటీ, హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఎల్‌ఎంఅండ్‌డీటీ. టీఅండ్‌హెచ్‌ఎం, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులో నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తె లిపారు. అర్హులను కలెక్టర్‌ అధ్యక్షులుగా, జిల్లా అదనపు కలెక్టర్‌, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉన్న కమిటీ నియామించనుంది. ఒక పీరియడ్‌కు రూ.390 చొప్పున ఒక నెలలో గరిష్టంగా 72 పీరియడ్‌లకు మాత్రమే చెల్లించనున్నారు. బ యోడేటాతో పాటు ఎస్సెస్సీ మెమో, ఇంటర్‌, డిగ్రీ, పీజీ మెమోలు, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు, లోకల్‌ లేదా నేటివిటీ, క్యాస్ట్‌ గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణతో స మర్పించాల్సి ఉంటుంది. ఈ నియామకాలు 202 3–24 విద్యాసంవత్సరానికి సంబంధించినవి మా త్రమేనని, రెన్యూవల్‌కు ఆస్కారం లేదని తెలిపారు.

 

UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..

హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో విద్యాబోధనకుగాను గెస్ట్‌ (అ తిథి) అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. రాజారెడ్డి బుధవారం తెలిపారు. ఇంగ్లిష్‌ 6, తెలుగు 1, సంస్కృతం 1, కామర్స్‌ 2, బీబీఏ 3, బిజినెస్‌ అనాలసిస్‌ 1, డాటాసైన్స్‌ 1, బాటనీ 1, జువాలజీ 2, మైక్రోబయాలజీ 1, కంప్యూటర్‌ సైన్స్‌ 3, క్రాఫ్‌ ప్రొడక్షన్‌ 1, ఫిష్‌ రిష్‌ 1, స్టాటిస్టిక్స్‌ 1 మొత్తంగా 25 పోస్టుల్లో గెస్ట్‌ లెక్చరర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈఖాళీల్లో యూజీసీ నిబంధనల ప్ర కారం పీజీ కోర్సుల్లో మార్కులు 55 శాతం కలిగి ఉండాలని, నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీలో ఏదైనా ఒక అర్హత కలిగిన అభ్యర్థులు జులై 25న సాయంత్రం 5 గంటల వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఇంటర్వ్యూలు జులై 26న ఉదయం 11 గంటల నుంచి కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు.. వివరాలకు 99480 32 343 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

MANIT Bhopal Recruitment 2023: మానిట్, భోపాల్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో..
కాళోజి సెంటర్‌ : వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న డీఐఈఓ కాక మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఖా నాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో (ఫిజిక్స్‌–1, మ్యాథమెటిక్స్‌–1, సివిక్స్‌–1), నర్సంపేట కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాలలో (మ్యాఽథమెటిక్స్‌–1, బోటనీ–1), నర్సంపేట ప్ర భుత్వ బాలిక జూనియర్‌ కళాశాలలో (మ్యాథమెటిక్స్‌–1, ఫిజిక్స్‌–1, బోటనీ–1), వర్ధన్నపేటలో (మ్యాథమెటిక్స్‌–1), రాయపర్తిలో (మ్యాథమెటిక్స్‌–1), సంగెంలో (మ్యాథమెటిక్స్‌–1, హిస్టరీ–1), నెక్కొండలో (మ్యాథమెటిక్స్‌–1, ఫి జిక్స్‌–1, కెమిస్ట్రీ–1), రంగశాయిపేటలో (మ్యాథమెటిక్స్‌–1) కృష్ణా కాలనీ బాలికల జూనియర్‌ కళాశాలలో (జువాలజీ–1, మ్యాథమెటిక్స్‌–1, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)–1) ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నియామకాలు 2023–2024 విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ పూర్తి చేసి, 50 శా తం కన్నా ఎక్కువ మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 24వ తేదీలోపు హనుమకొండలోని డీఐఈఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని వివరించారు. దరఖాస్తులతో పాటు పూర్తి బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు జతపర్చాలన్నారు.
 

#Tags