Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే! 

18 విశ్వవిద్యాలయాల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబ‌రు 20న నోటిఫికేషన్.

తూర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయంలో అక్టోబ‌రు 16న‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లోని 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబ‌రు 20న నోటిఫికేషన్ విడుదల చేస్తారని వెల్లడించారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

SSC Officer Posts in Indian Navy: భారత నౌకాదళంలో 224 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్‌ అధ్యాపకులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో అధ్యాపకుడు అకడమిక్‌గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

బోధనేతర సిబ్బంది
బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న రేషనలైజేషన్‌ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్‌తో కమిటీని నియమించామని చెప్పారు. 

Teacher Recruitment... Breaking News: త్వరలో AP DSC నోటిఫికేషన్... 3000+ పోస్ట్‌లు... ఇంకా!!

#Tags