Skip to main content

Teacher Recruitment... Breaking News: త్వరలో AP DSC నోటిఫికేషన్... 3000+ పోస్ట్‌లు... ఇంకా!!

త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
APDSCNotification, APTeacherVacancies, AP DSC 2023 Notification,APDSC2023,APTET,APGovtJobs2023,DSCApplication

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అక్టోబ‌ర్ 12వ తేదీన‌ వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ నాలుగైదు రోజుల్లోనే వస్తుందని చెప్పారు. దాదాపు 18 ఏళ్లుగా యూనివర్సిటీల్లో శాశ్వత పోస్టుల భర్తీ జరగలేదని గుర్తు చేశారు. అలాగే స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను కూడా గుర్తించామని.. మూడు నాలుగు రోజుల‌ల్లో డీఎస్సీపై స్పష్టత వస్తుందన్నారు. ముందు టెట్, తర్వాత డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ఐఐఐటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు.

Published date : 13 Oct 2023 09:27AM

Photo Stories