Komatireddy Venkat Reddy: పేద విద్యార్థికి కోమటిరెడ్డి అండ

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన కుంచం శివ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జనరల్‌ కేటగిరీలో 211వ ర్యాంకు, బీసీ కేటగిరీలో 24వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు సంపాదించాడు.

అయితే, శివ ఆర్థిక ఇబ్బందులతో ఫీజు చెల్లించలేకపోయాడు. చిన్న వయస్సు లో తల్లిదండ్రులను కోల్పోయిన శివకు అండగా నిలిచేవారు లేరు. శివ దీనస్థితిపై ‘సాక్షి’లో ఈ నెల 1న ‘సరస్వతీ పుత్రుడికి సాయం చేయరూ’శీర్షికన వార్త ప్రచురి తమైంది.

చదవండి: GATE Ranker : గేట్‌లో ఉత్త‌మ ర్యాంకుతో ఉన్న‌త‌ స్థానానికి.. జాతీయ స్థాయిలో..

ఈ వార్తను చూసిన నల్లగొండ కలెక్టర్‌ నారాయణరెడ్డి విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి తన కుమారుడి పేరుతో నిర్వహిస్తున్న కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ నుంచి ఏడాదికి రూ.లక్షన్నర ఆర్థిక సాయం ప్రకటించారు.

శివ నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయ్యేంతవరకు అండగా నిలబడ తానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో కష్టపడి చదివి ఉన్నతస్థానానికి చేరుకుంటానని శివ చెప్పాడు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపాడు.

#Tags