JEE Mains 2025 Schedule: జేఈఈ మెయిన్స్–2025 షెడ్యూల్ విడుదల.. సెక్షన్–బీలో చాయిస్ ఎత్తివేత
రెండు దఫాలుగా మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి సెషన్‌ను జనవరి 22 నుంచి 31 వరకు... రెండో సెషన్‌ను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తామని తెలిపింది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 28న సాయంత్రం నుంచి మొద లైంది. నవంబర్ 22 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడత దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది జనవరి 31 నుంచి మొదలు కానుంది. ఫిబ్రవరి 24న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
తొలి దశ ఫలితాలను ఫిబ్రవరి 12న, రెండో దశ ఫలితాలను ఏప్రిల్ 17న ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని ఐఐటీల్లో ప్రవే శాలకు అర్హత పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఐఐటీలు ప్రవేశాలు కల్పిస్తాయి.
సెక్షన్–బీలో చాయిస్ ఎత్తివేత
జేఈఈ మెయిన్స్–సెక్షన్–బీలో మూడేళ్లుగా కొనసాగుతున్న చాయిస్‌ను ఈసారి ఎత్తేశారు. జేఈఈ మెయిన్స్‌లో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 75 ప్రశ్నలతో మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసా యన శాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి.
కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో చాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్స్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
సెక్షన్– ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్–బీలో 10 ఇచ్చి ఐదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా చాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ చాయిస్ తీసేస్తున్నారు.
జేఈఈ మెయిన్స్–2025 షెడ్యూల్ ఇలా..
తొలి దశ మెయిన్స్...
- 28–10–2024 నుంచి 22–11–2024 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
- 22–1–2025 నుంచి 31–1–2025 మెయిన్స్ పరీక్ష
12–2–2025 - ఫలితాల ప్రకటన
రెండో దశ మెయిన్స్
- 31–1–2025 నుంచి 24–2–2025 దరఖాస్తుల స్వీకరణ
- 1–4–2025 నుంచి 8–4–2025 మెయిన్స్ పరీక్ష
17–4–2025 - ఫలితాల ప్రకటన