JEE Main 2025 Exam Format Changes: జేఈఈ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై ఆప్షన్స్ ఉండవు, ప్రశ్నపత్రంలో కీలకమార్పులు..
➤JEE Mains 2025 పరీక్షా ఫార్మాట్‌లో చోటుచేసుకుంటున్న ప్రధానమై మార్పు ఏమిటి?
జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఇకపై సెక్షన్ బీలో ప్రతి సబ్జెక్ట్ నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. అయితే గతంలో సెక్షన్-బీ నుంచి ఆప్షనల్ ప్రశ్నలు ఉండేవి. అయితే ఇకపై ఆ వెసలుబాటు లేదు. అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో కొనసాగుతున్న ఛాయిస్ ఆప్షన్ ఇకపై ఉండదు.
➤తాజా మార్పుల వల్ల ఏఏ సబ్జెక్టుల్లో క్వశ్చన్ పాటర్న్ మారుతుంది?
ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్, పేపర్-1),
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (బీఆర్క్/బీప్లానింగ్, పేపర్-2)
AIATSL Recruitment: ఎయిర్‌ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఎంపిక
➤సెక్షన్-B లో ఏమైనా ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయా?
లేదు.. అభ్యర్థులు ప్రతి విభాగం నుంచి సెక్షన్-బిలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎలాంటి మినహాయింపు లేదు
➤జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా విధానంలో ఎందుకు ఇప్పుడు ఇలాంటి మార్పులు చేశారు?
జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు, ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్ నేపథ్యంలో 2021 నుంచి మెయిన్స్ పరీక్షలో కొన్ని మార్పులు చేసింది ఎన్టీఏ. ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్ ఇచ్చారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
Inter Examination Fee Schedule: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల.. ఇదే చివరి అవకాశం
➤JEE Mains 2025 కొత్త పరీక్ష పత్రం గురించి మరింత సమాచారాన్ని ఎలా తెలుసుకోవచ్చు?
NTAఅధికారిక వెబ్‌సైట్ www.nta.ac.in, https://jeemain.nta.ac.inలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.
➤కొత్తగా వచ్చిన మార్పులతో క్వశ్చన్ పేపర్ మరింత కఠినంగా ఉండనుందా?
నిజానికి ఈ క్వశ్చన్ పేపర్ పాటర్న్ పాతదే. 2021 నుంచి మాత్రమే కోవిడ్ నేపథ్యంలో ఆప్షనల్ వెసలుబాటును కల్పించారు. ఇప్పుడు మళ్లీ పాత పద్దతిలోనే ప్రశ్నపత్రాన్ని కొనసాగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష కఠినత్వం కంటెంట్, ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది.
Tags
- JEE Main 2025 Exam Format Changes
- FAQs on JEE Main 2025 Exam Format Changes
- JEE Main 2025 Exam Format
- JEE Main 2025 exam pattern
- JEE Main 2025 Notification
- JEE Main 2025
- National Testing Agency
- JEE Mains 2025 changes
- NTA announcement JEE Mains
- JEE exam pattern updates
- JEE Mains 2025 question paper
- Engineering college admission changes
- JEE Mains exam system updates
- National Testing Agency updates
- New JEE Mains format