JEE Mains 2023 : జేఈఈ అర్హతలో మార్పులు ఇవే.. ఇంటర్‌లో కూడా..

సాక్షి ఎడ్యుకేషన్‌ : జేఈఈ మెయిన్స్‌ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి 11వ తేదీ (బుధవారం) ఒక ప్రకటనలో తెలిపింది.
jee mains 2023 changes

జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్‌లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్‌టీఏ తొలుత పేర్కొంది.

☛ Target JEE (Mains) 2023: how to score more marks ?

ఇంటర్‌లో 65 మార్కులు పొంది ఉంటే..

దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది. ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్‌టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్‌ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్ర యించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్‌ టు లోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్‌ 20 పర్సంటైల్‌ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్‌టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్‌లో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది.

☛ JEE Main Previous Papers (click here)

#Tags