JEE Main Advanced: జేఎన్టీయూలో ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో ప్ర‌వేశం పొందేందుకు విద్యార్థులు రాసే ప‌రీక్ష జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్‌డ్‌. ఈ ప‌రీక్ష ఈనెల 26వ తేదీని ఆదివారం నిర్వ‌హించారు..

రామగిరి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాలయాల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రామగిరి మండలం సెంటనరీకాలనీ మంథని జేఎన్టీయూలో ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షలో 106 మంది విద్యార్థులకు 104 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ చెరుకు శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Semester Exams: రేప‌టి నుంచి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం..

పరీక్షల నిర్వహణ తీరును హైదరాబాద్‌ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు. పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై కె.సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Government Schools: జూన్‌ 1 నుంచి 11వ తేదీ వరకు ‘బడిబాట’కు శ్రీకారం..

#Tags