JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు

జేఈఈ మెయిన్స్‌ 2025కు అప్లై చేయారా? ఒకవేళ ఇంకా చేయకపోతే వెంటనే చేసేయండి. రిజిస్ట్రేషన్‌ గడువు నేటితో ముగియనుంది. జేఈఈ-మెయిన్స్‌కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఇవాళ రాత్రి 9 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రూత్రి 11.50 వరకు ఫీజు చెల్లించవచ్చని NTA తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. రెండ సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
JEE Main 2025 Application Deadline

మొదటి సెషన్‌ జనవరి 2025లో జరగనుండగా, సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్‌- 2025 మొదటి సెషన్ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియ నేటితో(శుక్రవారం)తో ముగియనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
 

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 

Follow our YouTube Channel (Click Here)

  • జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-1: జవవరి 22 నుంచి 31, 2025 వరకు
  • జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2: ఏప్రిల్‌ 1 నుంచి 8, 2025 వరకు జరగనుంది. 

జేఈఈ మెయిన్ సెషన్ 1 2025కు దరఖాస్తు ఎలా చేయాలి?

ఎలా అప్లై చేసుకోవాలంటే: 

  1. అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in సందర్శించి, రిజిస్ట్రేషన్ చేయండి.
  2. అప్లికేషన్ ఫారం నింపడం: లాగిన్ అయి, వ్యక్తిగత, విద్య మరియు సంప్రదించు వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
  3. డాక్యుమెంట్ల అప్‌లోడ్: ఫోటో మరియు సంతకాన్ని సూచించిన ఫార్మాట్ మరియు పరిమాణం ప్రకారం అప్‌లోడ్ చేయండి.

 Follow our Instagram Page (Click Here)

ఫీజు చెల్లింపు: ఆన్‌లైన్ ద్వారా (నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌కార్డ్‌ లేదా యూపీఐ)ద్వారా ఫీజు చెల్లించండి.
• ఫీజు చెల్లించిన అనంతరం కన్ఫర్మేషన్‌ పీజీని ప్రింట్‌ తీసుకోండి.
• పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోండి. 
• మీ సెషన్‌ ముగిసిన తర్వాత లాగ్‌ అవుట్‌ చేయండి. ఒకేవేళ మీకు పాస్‌వర్డ్‌ మర్చిపోతే ఈమెయిల్‌ లేదా మెసేజ్‌కు వెరిఫికేషన్‌ వస్తుంది. 
• దరఖాస్తు వివరాలను రెండు సార్లు తనిఖీ చేసి సబ్‌మిట్‌ చేయండి. 
• భవిష్యత్‌ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ లేదా ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 

 Join our WhatsApp Channel (Click Here)

ముఖ్యమైన తేదీలు:

  1. అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2024
  2. అప్లికేషన్ చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 09:00 గంటల వరకు)
  3. ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 11:50 వరకు)
  4. పరీక్షా తేదీలు: జనవరి 22 నుండి జనవరి 31, 2025
  5. ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12, 2025లోపు

 Join our Telegram Channel (Click Here)


జేఈఈ మెయిన్ 2025 పరీక్షా షెడ్యూల్:

పరీక్ష రెండు షిఫ్టులుగా ఉంటుంది:
మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 నుండి 12:00
రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 నుండి 6:00

#Tags