JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024 రిజిస్ట్రేషన్‌ తేదీల మార్పు

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ తేదీలను మద్రాస్‌ ఐఐటీ మార్చింది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు ‘అడ్వాన్స్‌డ్‌’ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే, ఐఐటీ మద్రాస్‌ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని, తొలుత ప్రకటించిన ప్రకారం మే 26న పరీక్ష జరుగుతుందని పేర్కొంది.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

తాజాగా మార్చిన తేదీల ప్రకారం మే 10 సాయంత్రం 5 గంటల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. మే 17 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు (అడ్మిట్‌ కార్డులు) డౌన్‌లోడ్‌ చేసు కోవచ్చు. పరీక్ష అనంతరం అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

చదవండి: NEET & IIT Free Coaching: నీట్, ఐఐటీపై 30 రోజుల ఆన్‌లైన్‌ క్లాసులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ జూన్‌ 2న విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ఉదయం 10 గంటలకు ప్రకటిస్తారు. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 9, 10 తేదీ సాయంత్రం వరకు చేసుకోవచ్చు. 

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

#Tags